దుబాయ్ టీన్ క్రియేటివిటీ.. విద్యార్థులు, ట్యూటర్లను కలుపుతూ ఉచిత ప్లాట్‌ఫారమ్..!!
- October 17, 2024
యూఏఈ: దుబాయ్ కాలేజీకి చెందిన 14 ఏళ్ల విద్యార్థి అవయాన్ ఆర్య.. స్టడీమేట్ గురించి సోషల్ మీడియా పోస్ట్‌ను చూసినప్పుడు రాబోయే పరీక్ష గురించి భయపడ్డాడు. కానీ తన ట్యూటర్ టాంగ్ లీ సహాయంతో విజయం సాధించాడు. టాంగ్ అందించిన టిప్స్, స్టడీ పాయింట్లను సులువుగా పరీక్షలను గట్టెక్కినట్టు ఈ భారతీయ ప్రవాసి పేర్కొన్నాడు. COVID-19 సమయంలో దుబాయ్ కాలేజీ విద్యార్థి అద్వే గుప్తా యాప్ రూపొందించి పాఠాలు చెప్పాడు. ఇది అనతి కాలంలోనే విజయం సాధించింది. US-ఆధారిత ఉచిత ట్యూటరింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన స్కూల్‌హౌస్ అనే ప్లాట్‌ఫారమ్‌ను పోలిన యాప్ ను తీసుకురావాలని అనుకున్నట్లు ఆర్య,అద్వే తెలిపారు. సొంత పీర్-టు-పీర్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కోసం ఒక ప్రణాళికను రూపొందించడం ప్రారంభించారు. యూఏఈలో ట్యూటరింగ్ ఖరీదైనది. ప్రైవేట్ పాఠాల కోసం ప్రజలు గంటకు Dh200 నుండి Dh500 వరకు వసూలు చేస్తారని తెలిపారు. దీంతో తాము StudyMate తీసుకొచ్చామని తెలిపారు.దీని ద్వారా బోధించే వారితో ఉచితంగా విద్యార్థులను కనెక్ట్ అయ్యే అవకాశాన్ని అందిస్తుందన్నారు. ఇప్పటివరకు 70 మంది విద్యార్థులు ట్యూషన్లో పాల్గొనడానికి సైన్ అప్ చేసారని, 50 మంది బోధించడానికి సైన్ అప్ చేసారని వివరించారు. రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తామని ఆర్య టీమ్ గట్టి నమ్మకంతో చెబుతున్నారు. వారికి మా గల్ఫ్ ద్వారా అల్ ది బెస్ట్ చెబుదాం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి