UAEలో AED 300 చేరుకున్న 22K గోల్డ్ గ్రాము ధర...

- October 17, 2024 , by Maagulf
UAEలో AED 300 చేరుకున్న 22K గోల్డ్ గ్రాము ధర...

యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర తొలిసారిగా 300aed (UAE DIRHAM)చేరుకుంది. భారత కరెన్సీలో (1aed = 22.88rs) 6866.68/- రూపాయలతో సమానం.గత 10 రోజులుగా బంగారం ధర గ్రాముకు 292.50 దిర్హామ్ నుండి ఈ ఉదయం 300.25 చేరుకుంది. అయితే గతంలో బంగారం ధర పెరుగుదల విషయంలో దుబాయ్/యూఏఈలో 22కే బంగారం ధర గ్రాముకు 300 కు చేరుకుంటుందని ఏడాది క్రితమే చెబితే ఎవరూ నమ్మేవారు కాదు అని మలబార్ గోల్డ్ & డైమండ్స్ వైస్ చైర్మన్ అబ్దుల్ సలామ్ కేపీ అన్నారు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ ధర పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి.మొదటిగా, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం ప్రధాన కారణం. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా డాలర్ బలహీనత, బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అమెరికా డాలర్ బలహీనపడినప్పుడు, బంగారం ధరలు పెరుగుతాయి, ఎందుకంటే బంగారం డాలర్లలో కొలవబడుతుంది.

ఇంకా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అనిశ్చితి కూడా బంగారం ధరలను పెంచుతుంది. స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు, ఆర్థిక సంక్షోభాలు, మరియు రాజకీయ అస్థిరతలు ముదుపర్లను సురక్షితమైన పెట్టుబడుల వైపు మళ్లిస్తాయి. బంగారం ఒక సురక్షిత పెట్టుబడిగా భావించబడుతుంది, అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో దాని డిమాండ్ పెరుగుతుంది.

భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందా తగ్గే అవకాశం ఉందా అంటే ఈ పెరుగుదల అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువ, మరియు అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఇవన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతానికైతే బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా అనేది చెప్పడం కష్టం, కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com