ఆశకు పోయి ఆసుపత్రి పాలైన రకుల్ ప్రీత్ సింగ్.!

- October 18, 2024 , by Maagulf
ఆశకు పోయి ఆసుపత్రి పాలైన రకుల్ ప్రీత్ సింగ్.!

ఆశకు మించిన బరువులెత్తి అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఆసుపత్రి పాలైంది. వివరాల్లోకి వెళితే, రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్‌ ఫ్రీక్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అనేక ఫిట్‌నెస్ స్టూడియోస్ నడిపిస్తూ తనదైన శైలిలో ఓ వైపు బిజినెస్ చేస్తూనే.. మరోవైపు స్లిమ్ అండ్ స్లీకీ బాడీని మెయింటైన్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.

అయితే, తాజాగా మోయలేని బరువులెత్తి అనవసరంగా ఆసుపత్రి పాలైంది. ‘మనసు చెప్పింది. నేను మోసేయగలను.. అని మోసేశాను.. కానీ సీన్ రివర్స్ అయ్యింది..’ అని తనకు జరిగిన ప్రమాదం గురించి తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.

అయితే, రకుల్‌కి ఇదేం కొత్త కాదు. గతంలో ఫిట్‌నెస్‌లో భాగంగా చాలాసార్లే బరువులు ఎత్తింది. అయితే, టైమ్ అన్నిసార్లూ ఒకేలా వుండదు. కొన్ని సార్లు టైమ్ బ్యాడ్ అయితే ఇదిగో ఇలాగే రివర్స్ అవుతుంటుంది.

ఆమె త్వరగా కోలుకోవాలని నెటిజనం కోరుకుంటూ ట్వీట్స్ వేస్తున్నారు. ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో స్టార్ హీరోయిన్. ఇప్పుడు మాత్రం బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది.

విలక్షణ పాత్రలు చేస్తూ, తనదైన ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటోంది అక్కడ. రకుల్ త్వరగా కోలుకొని మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని మనం కూడా కోరుకుందాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com