ఫహాహీల్‌లో భద్రతా తనిఖీలు..2,200 ఉల్లంఘనలు నమోదు..!!

- October 20, 2024 , by Maagulf
ఫహాహీల్‌లో భద్రతా తనిఖీలు..2,200 ఉల్లంఘనలు నమోదు..!!

కువైట్: కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పెషల్ తనిఖీలు చేపట్టింది.  కువైట్ దక్షిణ అల్-అహ్మదీ గవర్నరేట్‌లోని అల్-ఫహాహీల్ ప్రాంతంలో చట్టాన్ని ఉల్లంఘించేవారిని, ట్రాఫిక్ ఉల్లంఘించేవారిని లక్ష్యంగా చేసుకుని చర్యలు ప్రారంభించింది. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి,  అంతర్గత మంత్రి షేక్ ఫహాద్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.  తనిఖీల సందర్భంగా 2,220 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు, మూడు మాదకద్రవ్యాల కేసులు నమోదు చేసినట్టు, 13 మందిని అదుపులోకి తీసుకోగా.. 16 కార్లు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com