బహ్రెయిన్ అరబ్ మూలాలపై ఇరాన్ వివాదస్పద వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన ఎంపీలు..!!
- October 22, 2024
మనామా: బహ్రెయిన్ అరబ్ దేశం కాదని ఇరాన్ సీనియర్ అధికారి ఇటీవల చేసిన ప్రకటనపై బహ్రెయిన్ లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతినిధుల కౌన్సిల్ సభ్యులు ఇరాన్ ప్రకటనను తీవ్రంగా తప్పుబట్టారు. బహ్రెయిన్ అరబ్ వారసత్వాన్ని గట్టిగా సమర్థించారు. విదేశీ సంబంధాలపై వ్యూహాత్మక మండలి అధ్యక్షుడు కమల్ ఖరాజీ చేసిన వ్యాఖ్యలను చరిత్రను వక్రీకరించడానికి, బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బహ్రెయిన్ శతాబ్దాల నాటి అరబ్ మూలాలను, దాని అరబ్ హోదాను ధృవీకరించే UN-పర్యవేక్షించిన ప్రజాభిప్రాయ సేకరణను..1783లో అరబ్ ఇస్లామిక్ రాజ్యంగా రాజ్యాన్ని స్థాపించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఖరాజీ వ్యాఖ్యలు గల్ఫ్ దేశాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాల్లో భాగమని ఎంపీ అహ్మద్ అల్ సలూమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరాజీ ప్రకటనలపై పలువురు ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇరాన్ అంతర్గత సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
విదేశీ వ్యవహారాలు, రక్షణ జాతీయ భద్రతా కమిటీ డిప్యూటీ చైర్ డాక్టర్ మర్యమ్ అల్ ధాన్ మాట్లాడూత.. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ నిబంధనలకు ఆమోదయోగ్యం కావని, బహ్రెయిన్ వ్యవహారాల్లో అనవసరమైన జోక్యం అని విమర్శించారు. ఇతర ఎంపీలు జలీలా అలావి , ఎంపీ మహమ్మద్ జన్నాహి , ఎంపి జమీల్ ముల్లా హసన్ లు కూడా ఇరాన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇరాన్ తన అంతర్గత సవాళ్ల నుండి దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలను గల్ఫ్, అరబ్ దేశాలు ముక్తఖంఠంతో ఖండించాలని కోరారు. ఎంపీలు మహ్మద్ యూసఫ్ అల్ మరాఫీ, హసన్ ఈద్ బౌఖమాస్, హిషామ్ అబ్దుల్ అజీజ్ అల్ అవధి, హసన్ ఇబ్రహీం హసన్ కూడా ఖరాజీ వ్యాఖ్యలను ఖండించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







