లండన్‌లో అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరిల షూటింగ్
- October 23, 2024
ఐదు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు, అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, My3 ఆర్ట్స్ బ్యానర్‌లపై లండన్ గణేష్, డా.ప్రవీణ్ రెడ్డి వూట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సితార ఫిల్మ్స్ లిమిటెడ్ లైన్ ప్రొడక్షన్‌ని నిర్వహిస్తోంది.
ఈ మూవీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. లండన్ లో అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్న మూవీ స్పైన్ చిల్లింగ్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది.
డైరెక్షన్‌తో పాటు టెక్నికల్ ఎక్సలెన్స్‌తో కూడుకున్న ఈ సినిమాకి ఆండ్రూ బాబు సినిమాటోగ్రఫీ కూడా నిర్వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. డిఆర్‌కె కిరణ్ ఆర్ట్ డైరెక్టర్ కాగా, రియల్ సతీష్ స్టంట్ డైరెక్టర్.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను విడుదల చేయనున్నారు.
నటీనటులు: అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి, వైవా హర్ష, వెన్నెల కిషోర్, ఎస్ నివాసిని, షకలక శంకర్, మహేంద్ర, రెడిన్ కింగ్స్లీ తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ: బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్ & My3 ఆర్ట్స్
నిర్మాతలు: లండన్ గణేష్ & డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల
లైన్ ప్రొడక్షన్స్: సితార ఫిల్మ్స్ లిమిటెడ్
డైరెక్టర్ & డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఆండ్రూ బాబు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్ డైరెక్టర్: DRK కిరణ్
యాక్షన్ డైరెక్టర్: రియల్ సతీష్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సాల్మన్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక