బాలయ్య సినిమాలో ఆ టాలెంటెడ్ బ్యూటీ.!

- October 24, 2024 , by Maagulf
బాలయ్య సినిమాలో ఆ టాలెంటెడ్ బ్యూటీ.!

నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంగా రూపొందుతోన్న సినిమాలో చిన్న సినిమాలకు పెద్ద నటిగా పేరు తెచ్చుకున్న ఛాందినీ చౌదరి నటిస్తోంది.

లేటెస్ట్‌గా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మేకర్లు ప్రూవ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. చాలా వరకూ ఓటీటీల్లో రిలీజైన సినిమాల ద్వారా ఛాందినీ చౌదరి సుపరిచితురాలు.

‘కలర్ ఫోటో’ సినిమా ద్వారా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా చాలా సినిమాల్లో నటించింది. నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఛాందినీ చౌదరి సోలో హీరోయిన్‌గానూ సక్సెస్ అయ్యింది.

తాజాగా పెద్ద సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. బాలయ్య - బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓ వైపు చిన్న సినిమాలతో బిజీగా వుంటూనే పెద్ద సినిమాల్లోనూ నటించేందుకు ఉత్సాహం చూపిస్తోంది చాందినీ చౌదరి.

మంచి టాలెంట్ వున్న నటి. ఏ పాత్రలోనైనా తనదైన గుర్తింపు దక్కించుకోగల కెపాసిటీ వుంది. చూడాలి మరి, బాలయ్య సినిమాలో ఛాందిని పాత్ర ఎలా వుండబోతోందో.!’

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com