కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. ప్రతి నివాసికి ఒక కారు మాత్రమే.. జరిమానాలు పెంపు..!!
- October 25, 2024
కువైట్: కొత్త ట్రాఫిక్ చట్టం ప్రతి ఒక్కరికి ఒక్క కారు మాత్రమే ఉండాలని నిబంధనను తీసుకొస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ట్రాఫిక్, కార్యకలాపాల వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, మేజర్ జనరల్ యూసఫ్ అల్-ఖుదా తెలిపారు. త్వరలో ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్‌ను జారీ చేయవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుతం కువైట్‌లో దాదాపు 1.9 మిలియన్ల డ్రైవింగ్ లైసెన్స్‌లు, దాదాపు 2.5 మిలియన్ వాహనాలు ఉన్నాయి. ప్రస్తుత ట్రాఫిక్ చట్టం 1976 నుండి అమలులో ఉంది.
కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం.. రాంగ్ పార్కింగ్ (నిషేధించబడిన ప్రాంతంలో పార్కింగ్) చేసినందుకు అతి తక్కువ మొత్తంలో 15 కువైట్ దినార్లు జరిమానా విధించబడుతుంది. డ్రైవింగ్‌లో ఫోన్ వాడితే జరిమానాను కొత్త చట్టంలో 5 దీనార్ల నుంచి 75 కేడీలకు పెంచగా, సీటు బెల్టు పెట్టుకోకుంటే జరిమానాను 10 దీనార్ల నుంచి 30 దినార్లకు పెంచనున్నారు. లేజీ డ్రైవింగ్‌కు జరిమానా, రెడ్ సిగ్నల్‌ను అమలు చేస్తే జరిమానాను 150 దినార్లకు పెంచనున్నారు. కొత్త చట్టంలో ఓవర్‌స్పీడ్‌కు 150 దీనార్లు జరిమానా కూడా విధించబడుతుంది. ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాలను వినియోగిస్తే జరిమానా 10 దినార్ల నుండి 150 దినార్లకు పెంచబడుతుంది.మద్యం సేవించి వాహనం నడిపినందుకు 3,000 కువైట్ దినార్ల వరకు ఫైన్, రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే 2000 నుంచి 3000 దీనార్ల మధ్య 1 నుంచి 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







