మనామా సౌక్ పునరుజ్జీవన ప్రణాళిక.. పార్లమెంటులో ఓటింగ్..!!
- October 26, 2024
మనామా: చారిత్రాత్మక మార్కెట్‌గా ఉన్న మనామా సౌక్‌ను పునరుజ్జీవింపజేయాలని ప్రభుత్వాన్ని కోరే ప్రతిపాదనపై ప్రతినిధుల సభ ఓటు వేయనుంది. ఎంపీలు అహ్మద్ కరాటా, మొహసేన్ అల్ అస్బౌల్, మహమూద్ మీర్జా, హసన్ బుక్మాస్, మమ్‌దౌహ్ అల్ సలేహ్ ఈ ప్రతిపాదనను సమర్పించారు. సౌక్ చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతను పునరుద్ధరించడం, బహ్రెయిన్ సంప్రదాయాలు, వారసత్వాన్ని పర్యాటకులకు ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతినిధుల సభ సర్వీసెస్ కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదించాలని సిఫార్సు చేసింది. మనామా సౌక్ అనేది బహ్రెయిన్‌లోని పురాతన అత్యంత ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలలో ఒకటి. ఇది దేశవ్యాప్తంగా టోకు వ్యాపారులకు, రిటైలర్లకు ప్రధాన కేంద్రంగా సేవలు అందిస్తుంది. ప్రస్తుతం సౌక్ నిర్మాణ సమస్యలతోపాటు పార్కింగ్ , పబ్లిక్ సౌకర్యాలు లేకపోవడం (రెస్ట్రూమ్లు, షేడెడ్ ఏరియాలు, రెస్టారెంట్లు మొదలైనవి),ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పర్యాటక మంత్రిత్వ శాఖ మనామా సౌక్‌లోని కీలక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కన్సల్టింగ్ ఇంజనీరింగ్ సంస్థను నియమించడానికి టెండర్ బోర్డు ద్వారా టెండర్ జారీ చేసింది. ఈ ప్రణాళికకు అధికారిక మద్దతు లభిస్తుందో లేదో రాబోయే పార్లమెంటరీ ఓటింగ్ నిర్ణయిస్తుంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







