యూఏఈలో డ్రైవర్ల కనీస వయోపరిమితి తగ్గింపు..!!

- October 26, 2024 , by Maagulf
యూఏఈలో డ్రైవర్ల కనీస వయోపరిమితి తగ్గింపు..!!

యూఏఈ: యూఏఈ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలపై కొత్త ఫెడరల్ డిక్రీ చట్టాన్ని ప్రకటించింది. ఇది మార్చి 29, 2025 నుండి అమలులోకి వస్తుంది. 17 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఇప్పుడు డ్రైవింగ్ చేయడానికి లైసెన్స్ పొందేందుకు అనుమతించబడ్డారు. ఇంతకుముందు, కార్లు తేలికపాటి వాహనాలు నడపడానికి అర్హత పొందాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.  సెల్ఫ్ డ్రైవింగ్, ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుతున్న వినియోగానికి అనుగుణంగా ట్రాఫిక్ చట్టం కొన్ని మార్పులు చేసినట్టు అధికార యంత్రాంగం తెలిపింది. జాయ్ వాకింగ్, అల్కాహల్ డ్రైవింగ్ లాంటి వాటికి కొత్త చట్టంలో భారీగా జరిమానాలు విధించారు. అలాగే ఉల్లంఘన తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసేందుకు నిబంధనలను పొందుపరిచారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com