బెస్ట్ ఆఫ్ బహ్రెయిన్‌..ఈ నవంబర్‌లో జరగబోయే ఆరు కీలక ఈవెంట్‌లు..!!

- October 27, 2024 , by Maagulf
బెస్ట్ ఆఫ్ బహ్రెయిన్‌..ఈ నవంబర్‌లో జరగబోయే ఆరు కీలక ఈవెంట్‌లు..!!

మనామా: బహ్రెయిన్ టూరిజం, ఎగ్జిబిషన్స్ అథారిటీ నవంబర్‌లో ఆరు కీలక ఈవెంట్‌లను ప్రకటించింది. జ్యూయలరీ అరేబియా 2024 ప్రదర్శన ఒక ప్రధాన ఆకర్షణ కాగా, బహ్రెయిన్ వెలుపల నుండి 650 బ్రాండ్‌లను ఒకచోట చేర్చనుంది. నవంబర్ 26 నుండి 30 వరకు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో 'సెంట్ అరేబియా' గల్ఫ్ ప్రాంతం సువాసనలు సందర్శకులను ఆకట్టుకోనుంది.

నవంబర్ 1 మరియు 2 తేదీల్లో ‘బాప్కో ఎనర్జీస్’ ఈవెంట్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌ వినోదాన్ని అందిస్తుంది. లైనప్‌లో అక్రోబాటిక్ బాస్కెట్‌బాల్, లైవ్ DJలు, పిల్లల కోసం వివిధ రకాల కార్యకలాపాలు ఉన్నాయి. టిక్కెట్ల ధర పెద్దలకు 5.5 దినార్లు మరియు పిల్లలకు 2.750 దినార్లు.

 మూడు స్పోర్ట్స్ ఈవెంట్‌లు కూడా జరుగుతాయి. నవంబర్ 1,  2 తేదీలలో బహ్రెయిన్ 8-గంటల ఎండ్యూరెన్స్ రేస్ అందులో ఒకటి. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో 'హోమ్ ఆఫ్ మోటార్‌స్పోర్ట్ ఇన్ ది మిడిల్ ఈస్ట్' ఉంటుంది. ఈ రేసును 'బాప్కో ఎనర్జీస్' స్పాన్సర్ చేస్తుంది. రెండు రోజుల పాటు రేసింగ్ ను ఆస్వాదించవచ్చు.

నవంబర్ 6 నుండి 9 వరకు.. సర్క్యూట్ నాసర్ బిన్ హమద్ సైక్లింగ్ టూర్‌ను నిర్వహిస్తుంది. దాని నాల్గవ ఎడిషన్‌లో బహ్రెయిన్ గల్ఫ్ నుండి సుమారు 500 మంది సైక్లిస్టులు వస్తారని అంచనా వేస్తున్నారు. నవంబర్ 1, 2 తేదీలలో 3x3 బాస్కెట్‌బాల్ వరల్డ్ టూర్‌ను నిర్వహిస్తున్నారు.  ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి జట్లు పాల్గొంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com