ఒమానీ యువజన దినోత్సవం.. సయ్యద్ థెయాజిన్ అధ్యక్షత వేడుకలు
- October 27, 2024
మనా: ఒమానీ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన వేడుకలకు సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి హెచ్‌హెచ్ సయ్యద్ థియాజిన్ బిన్ హైథమ్ అల్ సయీద్ అధ్యక్షత వహించారు. విలాయత్ ఆఫ్ మనా (A'Dakhiliyah గవర్నరేట్)లోని "ఒమన్ అక్రాస్ ది ఏజెస్ మ్యూజియం"లో జరిగిన ఈ వేడుకలో యూత్ ఎక్సలెన్స్ అవార్డు విజేతలను ఘనంగా సన్మానించారు. 10 థీమ్‌లతో కూడిన 3-రోజుల యూత్ ఇనిషియేటివ్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు ఆర్థిక సాంకేతికత, విద్య, ఉపాధి, శారీరక దృఢత్వం, చేతిపనులు, పర్యావరణం, మీడియా, ఇంజనీరింగ్ సహా అనేక రకాల స్పెషలైజేషన్లను కవర్ చేస్తాయని పేర్కొన్నారు. ఈ వేడుకలో గవర్నరేట్లలో యూత్ సెంటర్ శాఖలను ప్రారంభించారు. ఈ వేడుకలో ఐదు ‘సహకారం,భాగస్వామ్య ఒప్పందాలపై’ సంతకాలు జరిగాయి. వేడుక ముగింపు సందర్భంగా 2024 సంవత్సరానికి యూత్ ఎక్సలెన్స్ అవార్డు (5వ ఎడిషన్) విజేతలను హెచ్‌హెచ్ సయ్యద్ థెయాజిన్ సత్కరించారు. డిజిటల్ మీడియా, డిజిటల్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, యూత్ అనే ఐదు డొమైన్ల నుండి 21 మంది యువకులను ఎంపిక చేసి అవార్డులను అందజేశారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!