Dh100,000 నగదు తిరిగిచ్చిన ప్రవాస భారతీయుడు.. సన్మానించిన పోలీసులు..!!

- October 27, 2024 , by Maagulf
Dh100,000 నగదు తిరిగిచ్చిన ప్రవాస భారతీయుడు.. సన్మానించిన పోలీసులు..!!

యూఏఈః 100,000 దిర్హామ్ల నగదును అథారిటీకి తిరిగి ఇచ్చినందుకు భారతీయ ప్రవాసిని సత్కరించినట్లు దుబాయ్ పోలీసులు ప్రకటించారు. దుబాయ్ నివాసి స్వదేశ్ కుమార్ నగరంలోని అల్ బర్షా ప్రాంతంలో నగదు దొరికింది. దానిని ఆయన నిస్వార్ధంగా పోలీసులకు అందజేశారు. ఈ సందర్భంగా స్వదేశ్కు పోలీసులు ప్రశంసా పత్రాన్ని అందించి ఘనంగా సత్కరించారు. బాధ్యత గల వ్యక్తిగా గొప్ప మానవత విలువలను కలిగి ఉన్నాడని పోలీసులు ప్రశంసించారు. అల్ బార్షా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ మాజిద్ అల్ సువైదీ మాట్లాడుతూ.. ప్రజా సహకారాన్ని పెంపొందించడం ద్వారా దుబాయ్ పోలీసులు తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడంలో ఇటువంటి నిజాయితీ చర్యలు సహాయపడతాయని పేర్కొన్నారు. అనంతరం "విలువైన వస్తువులు నిజమైన యజమానికి సురక్షితంగా తిరిగి వచ్చేలా చూసేందుకు అల్ బార్షా పోలీస్ స్టేషన్కి తిరిగి ఇవ్వడం తన విధి" అని కుమార్ తనకు లభించిన గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com