5 కొత్త బ్రిడ్జిలతో దుబాయ్ ఐకానిక్ ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్
- October 27, 2024
దుబాయ్: దుబాయ్‌లోని ఐకానిక్ ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్ను ప్రధాన కూడలిగా మార్చేందుకు Dh696 మిలియన్ దిరహం తో ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదు కొత్త వంతెనలు నిర్మించబడతాయి. ఈ వంతెనలు మొత్తం 5,000 మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ట్రాఫిక్ ఆలస్యం సమయం 12 నిమిషాల నుండి కేవలం 90 సెకన్లకు తగ్గుతుందనీ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ట్రాఫిక్ రద్దీ మెరుగుపడటమే కాకుండా ప్రధాన రహదారుల మధ్య అనుసంధానం సులభమవుతుంది.
ఈ ప్రాజెక్ట్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC) మరియు దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) వంటి ముఖ్యమైన ప్రాంతాలకు సేవలు అందిస్తుంది. ఇది దుబాయ్‌లోని సుమారు 5 లక్షల మంది నివాసితులు మరియు సందర్శకులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
ఈ ప్రాజెక్ట్ దుబాయ్ నగర అభివృద్ధికి మరియు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంలో ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పవచ్చు.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







