బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో 2024..ఒకే వేదికపై రక్షణ, భద్రతా ఆవిష్కరణలు..!!
- October 28, 2024
మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో (BIAS) 2024కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రక్షణ, భద్రతకు సంబంధించిన ప్రపంచ ఆవిష్కరణలకు ఇది కేరాఫ్ గా నిలువనుంది. నవంబర్ 13-15 వరకు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జరుగనుంది. రాయల్ బహ్రెయిన్ ఎయిర్ ఫోర్స్ (RBAF) సహకారంతో బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ద్వారా దీనిని నిర్వహిస్తున్నారు. సందర్శకులు కోసం ప్రపంచంలోని అత్యంత అధునాతన ఆవిష్కరణలు తరలిరానున్నాయి. లైనప్ లో లాక్‌హీడ్ మార్టిన్, రోల్స్ రాయిస్, థేల్స్ వంటి పరిశ్రమ దిగ్గజాలు ఉన్నాయి. ఇందులో సైనిక జెట్‌లు, అధునాతన వాణిజ్య విమానాల డైనమిక్ ఫ్లయింగ్ షోకేస్‌లు ఉన్నాయి. ఈ ఈవెంట్‌లో రెడ్ ఆరోస్, యూఏఈ అల్ ఫుర్సాన్, సౌదీ హాక్స్ పాల్గొంటున్నాయి. ఈ ప్రదర్శన సందర్భంగా ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల, రక్షణ సాంకేతిక నిపుణులతో కాన్ఫరెన్స్ ఎజెండాలో ఉంది. రక్షణ, సైబర్ భద్రత, మానవరహిత వైమానిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న రక్షణ సాంకేతికతలలో కృత్రిమ మేధస్సు కీలకాంశాలుగా చర్చలు జరుగనున్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







