అబుదాబి బాప్స్ హిందూ మందిర్ లో దీపావళి, అన్నకూట్ వేడుకలు..వైభవంగా ఏర్పాట్లు..!!
- October 28, 2024
యూఏఈ: దీపావళి వేడుకలు అబుదాబి బాప్స్ హిందూ మందిర్ సిద్ధమవుతుంది. టెంపుల్ ప్రారంభమైన తర్వాత తొలి దీపావళి కావడంతో అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలకు సందర్శకులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రారంభమైన మొదటి ఏడు నెలల్లోనే ఆలయాన్ని ఇప్పటికే 1.5 మిలియన్ల మంది భక్తులు సందరహించారు. ఆలయ డిజైన్, ఆర్కిటెక్చర్, కల్చర్, ఇంజనీరింగ్ నైపుణ్యం ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.
ఆలయం మొదటి దీపావళి, అన్నకూట్ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ..వందలాది మంది అంకితభావంతో కూడిన వాలంటీర్లు పగలు, రాత్రి అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. అక్టోబర్ 31, నవంబర్ 2, 3 తేదీలలో జరిగే వేడుకల సందర్భంగా ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భగవంతుని దయకు కృతజ్ఞతగా..వందలాది స్వచ్ఛమైన శాఖాహార వంటకాలతో పాటు ఎడారిలోని తామరపూలు, నెమళ్లు, రామసేతు, కైలాష్ పర్వతం, మానసరోవర్, జగన్నాథ రథం, బంగారు మెట్లు, కళాత్మకమైన అరటి ఆకులతో కూడిన సృజనాత్మక సెట్టింగ్‌లలో ఆలయాన్ని వేడుకల కోసం సిద్ధం చేస్తున్నారు.
భక్తులు ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. సొంత వాహనాల్లో వచ్చే సందర్శకులు అల్ షహమా ఎఫ్1 పార్కింగ్ వద్ద పార్క్ చేయాలి. ఈవెంట్ పార్కింగ్ ప్రదేశం నుండి ఆలయ స్థలం వరకు తరచుగా షటిల్ బస్సులను ప్రభుత్వం నడుపుతుంది. బ్యాగులు, నగలు, విలువైన వస్తువులతో సహా మెటల్ వస్తువులు తీసుకురావద్దని ఆలయ అధికారులు సూచించారు.
వేడుకల షెడ్యూల్
అక్టోబర్ 31వ తేదీ దీపావళి వేడుకలు.
దర్శనం: ఉదయం 9 - రాత్రి 9 గంటల వరకు
నవంబర్ 2 : అన్నకూట్ దర్శనం: ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు
నవంబర్ 3 : అన్నకూట్ దర్శనం: ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు
ఆలయ మార్గదర్శకాలు, నిషేధించబడిన వస్తువుల జాబితా కోసం mandir.ae/visit ని సందర్శించాలి. మరింత సమాచారం కోసం విశాల్ పటేల్‌ని [email protected] లో సంప్రదించాలని తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







