యూఏఈ వీసా క్షమాభిక్ష.. దశాబ్దం తర్వాత ఇంటికి వెళుతున్న మహిళ..!!
- October 28, 2024
యూఏఈ: షార్జా నివాసి రబియా బంగ్లాదేశ్‌లోని తన స్వస్థలాన్ని వదిలినప్పుడు, ఆమె కుమార్తెకు కేవలం తొమ్మిదేళ్లు. తాజాగా రబియా క్షమాభిక్ష పొంది ఇంటికి వెళ్లనుంది. ప్రస్తుతం ఆమె కుమార్తెకు 19 సంవత్సరాలు. రబియా మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా తన కుమార్తే నన్ను తిరిగి రావాలని నిరంతరం ఫోన్లో ఏడుస్తూనే ఉందని చెప్పారు. "నేను నా కూతురిని కౌగిలించుకుని, నా చేతుల్లో ఆమెను తీసుకోని ఏడవాలని పిస్తుంది." ఆమె భావోద్వేగంతో చెప్పింది. తన కుటుంబానికి ఏకైక ఆధారం అయిన రబియా 11 ఏళ్ల క్రితం తొలిసారిగా యూఏఈకి వచ్చింది. అనేక వైద్య సమస్యలు, నొప్పులతో పోరాడుతున్న రబియా.. ప్రస్తుతం రెండు ఇళ్లలో పార్ట్‌టైమ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.
సెప్టెంబరు 1న యూఏఈ రెండు నెలల సుదీర్ఘ క్షమాభిక్షను ప్రకటించింది. ఇది దేశంలో అక్రమంగా నివసిస్తున్న వేలాది మందికి ఆశలు కల్పించింది. వారు ఇప్పుడు ఎలాంటి పెనాల్టీలు లేకుండా దేశం విడిచి వెళ్లవచ్చు. లేదా వారు ఇక్కడే ఉద్యోగాలు చేయాలనుకుంటే, అర్హతలు ఉన్న వారి వీసాను రెసిడెన్సీ వీసాగా మార్చుకోవచ్చు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







