జీసీసీ దేశాల ఉదారత.. గ్లోబల్ హెల్త్ కేర్ లో $100 బిలియన్ల పెట్టుబడి..!!
- October 28, 2024
మనామా: గ్లోబల్ హెల్త్‌కేర్ ఇనిషియేటివ్‌లలో బహ్రెయిన్‌తో సహా గల్ఫ్ దేశాలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిచూపుతున్నాయని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. కనీసం ఐదు గల్ఫ్ ఫండ్లు వచ్చే ఏడాది చివరి నాటికి ఆరోగ్య సంబంధిత కంపెనీలు కార్యక్రమాలలో దాదాపు 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాయి. ఈ పెట్టుబడులు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లు, సంవత్సరానికి మిలియన్ల మందిని ప్రభావితం చేసే వ్యాధుల చికిత్సలపై పరిశోధన వంటి ముఖ్యమైన ప్రయత్నాలకు మద్దతు ఇస్తాయన్నారు. ఆర్థిక వాతావరణ సంక్షోభాల కారణంగా జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి సాంప్రదాయ దేశాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివేదిక హైలైట్ చేసింది. ఇది ఆరోగ్య కార్యక్రమాలపై ఖర్చు తగ్గించడానికి దారితీసిందని వెల్లడించింది.
ఉదాహరణకు.. పేద దేశాలలో కలరా, మీజిల్స్ వంటి వ్యాధులకు వ్యాక్సిన్లను అందించడంలో సహాయపడే గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్లు, ఇమ్యునైజేషన్ (GAVI).. ప్రోగ్రామ్ కు అవసరమైన నిధులలో కేవలం మూడింట ఒక వంతు ($9 బిలియన్లు) మాత్రమే సేకరించింది. బహ్రెయిన్‌తో సహా గల్ఫ్ దేశాలు GAVI కార్యక్రమాలకు $267 మిలియన్లను అందించనున్నట్లు హామీ ఇచ్చాయి. ఇది అంతర్జాతీయ మానవతా, ఆరోగ్య ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడంలో గల్ఫ్ దేశాల భాగస్వామ్యం పెరుగుతుందని నివేదిక తెలిపింది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఈ దేశాల సాయం తక్కువే అయినా, నిధుల సేకరణలో ఉన్న అంతరాలను భర్తీ చేయడంలో GCC రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







