ఒమన్ లో తొలి ఐరన్ ఓర్ కాన్సంట్రేషన్ ప్లాంట్‌.. వాలే, జిన్నాన్ $600mn పెట్టుబడి..!!

- October 28, 2024 , by Maagulf
ఒమన్ లో తొలి ఐరన్ ఓర్ కాన్సంట్రేషన్ ప్లాంట్‌.. వాలే, జిన్నాన్ $600mn పెట్టుబడి..!!

మస్కట్: సోహార్ పోర్ట్, ఫ్రీజోన్‌లో ఒమన్ మొదటి ఇనుప ఖనిజం కేంద్రీకరణ ప్లాంట్‌లో $600 మిలియన్ల  పెట్టుబడి  పెట్టనున్నట్లు ఇనుప ఖనిజం ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న వాలే, జిన్నాన్ కంపెనీలు సంయుక్తంగా వెల్లడించాయి. వేల్ $227 మిలియన్లను పెట్టుబడి పెడుతుండగా, జిన్నాన్ సుమారు $400 మిలియన్లను పెట్టుబడి పెడుతుంది. వాణిజ్యం, పరిశ్రమలు పెట్టుబడి మంత్రిత్వశాఖ మంత్రి కైస్ బిన్ మహ్మద్ అల్ యూసెఫ్ సమక్షంలో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజా పెట్టుబడి  ఒమన్ ఇనుము, ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు.  

2027 మధ్య నాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ ఏటా 18 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ప్రాసెస్ చేస్తుందని, 12.6 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తుందని వారు ప్రకటించారు. వేల్ ప్రెసిడెంట్ గుస్తావో పిమెంటా మాట్లాడుతూ.. తాజా ప్లాంట్ ఒమన్ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందన్నారు. అలాగే , ఇనుప ఖనిజం కోసం పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌ను ఈ ప్లాంట్ తీర్చుతుందని తెలిపారు.  జిన్నాన్ ఐరన్ & స్టీల్ గ్రూప్ సీఈఓ ఝాంగ్ టియాన్ఫు మాట్లాడుతూ.. ఇనుప ఖనిజం ఉత్పత్తిలో వాలే నైపుణ్యంతో ఆధునిక తక్కువ-కార్బన్ ఉక్కు తయారీలో జిన్నాన్ గొప్ప అనుభవాలను జోడించేందుకు ఈ భాగస్వామ్యం మంచి అవకాశాన్ని కల్పిందని అన్నారు.   

కాన్‌సెంట్రేషన్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమకు మించిన ఆర్థిక ప్రయోజనాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని సృష్టించడం, సాంకేతిక పురోగతిని పెంచడం, ఎగుమతి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ప్లాంట్ ఒమన్ ఎగుమతి సామర్థ్యాలను పెంచుతుంది.  సుల్తానేట్‌ను ప్రపంచ ఉక్కు వాణిజ్య మార్గంలో మరింత అనుసంధానిస్తుందని, పారిశ్రామిక స్థావరాన్ని విస్తరించే ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com