కిరణ్ అబ్బవరం ‘క’తో ఏదో మ్యాజిక్ చేసేలానే వున్నాడు.!

- October 28, 2024 , by Maagulf
కిరణ్ అబ్బవరం ‘క’తో ఏదో మ్యాజిక్ చేసేలానే వున్నాడు.!

‘క’ అనే కొత్త టైటిల్‌లో కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సారిక, రిధి కుమార్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఓ డిఫరెంట్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లో ప్రత్యేకంగా రూపొందిన సినిమా ఇది.

ట్రైలర్‌తో పాటూ విడుదలైన ప్రచార చిత్రాలన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ దీపావళి రేస్‌లో రిలీజ్ అవుతున్న నాలుగు సినిమాల్లో ‘క’పైనా అంచనాలు బాగానే వున్నాయ్.

అంతేకాదు, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడియన్స్‌కి సరికొత్త ఫీలింగ్ ఇవ్వకపోతే ఇకపై సినిమాలు మానేస్తా.. అని తన సన్నిహితులతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడట కిరణ్ అబ్బవరం. అంటే, ఈ సినిమా రిజల్ట్‌పై మనోడికి చాలా అంచనాలున్నాయన్నమాట.

మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశాలున్నాయ్ ప్రమోషన్స్ బజ్‌ని బట్టి. ప్రచార చిత్రాల్లో చూపించినట్లుగా కంటెంట్ ఇంట్రెస్టింగ్‌గా వుంటే మాత్రం సినిమా పక్కా హిట్ అయ్యే అవకాశాలున్నాయ్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com