ఒమానీ మహిళా ట్యాక్సీ డ్రైవర్లకు.. ‘ఓ ఫిమేల్’ గేమ్ ఛేంజర్‌..!!

- October 29, 2024 , by Maagulf
ఒమానీ మహిళా ట్యాక్సీ డ్రైవర్లకు.. ‘ఓ ఫిమేల్’ గేమ్ ఛేంజర్‌..!!

మస్కట్: 2022లో ఓ ట్రాక్సీ ఓ ఫీమేల్ ( O Taxi O Female) మహిళా డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా టాక్సీ సేవను పరిచయం చేసింది. ఇది ఒమన్ రవాణా పరిశ్రమలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. ఓ ఫిమేల్ వేగంగా జనాదరణ పొందింది. ముఖ్యంగా మస్కట్‌లో, సోహర్, సలాలా ఫుల్ డిమాండ్ ఉంది. ఈ సేవ మహిళా ప్రయాణీకులకు అనుకూలమైన,  సురక్షితమైన రవాణా ఎంపికను అందించడంతోపాటు ఒమానీ మహిళలు వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించడానికి, ఆర్థిక స్వాతంత్ర్యం పొందడానికి ఒక ముఖ్యమైన అవకాశంగా కూడా మారింది.

O ఫిమేల్ చాలా మంది ఒమానీ మహిళలకు గేమ్ ఛేంజర్‌గా మారింది. వారికి స్థిరమైన ఆదాయాన్ని, సౌకర్యవంతమైన పని గంటలను అందిస్తోంది.  ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లేని మహిళలకు, ఈ చొరవ విలువైన ఉపాధి మార్గాన్ని పొందుతున్నారు. మహిళా డ్రైవర్లు వారానికొకసారి ఘలాలోని కార్యాలయంలో సమావేశమవుతారు. అక్కడ వారు పనికి సంబంధించిన విషయాలను చర్చిస్తారు. ఒమానీ మహిళా నాయకుల సహాయక బృందం నుండి అవసరమైన సూచనలను పొందుతారు. “నేను ఓ టాక్సీ డ్రైవర్‌గా నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు కనీస జీతం OMR200.  కమీషన్‌తో కలిపి నెలకు OMR500 వరకు సంపాదిస్తున్నాను,.  సౌకర్యవంతమైన వర్కింగ్ అవర్స్ తోపాటు నేను సురక్షితంగా ఉన్నాను.’’ అని నజీబా అనే యువ డ్రైవర్ తెలిపారు. కొందరు మహిళలు పార్ట్ టైమ్ గా కూడా తమ సేవలు అందిస్తూ రెండు చేతులా ఆదాయాన్ని పొందుతున్నట్లు ఓ ట్యాక్సీ సీఈఓ హరిత్ అల్ మక్బాలీ తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com