కువైట్ లో డిగ్రీ లేని 60 ఏళ్లు పైబడిన ప్రవాసులకు శుభవార్త..!!
- November 04, 2024
కువైట్: మూడు సంవత్సరాల ఆంక్షలను అమలు చేసిన తర్వాత, కువైట్ ఇప్పుడు యూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు పైబడిన ప్రవాస కార్మికుల కోసం నిబంధనలను సడలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ 60 ఏళ్లు పైబడిన విశ్వవిద్యాలయం లేని ప్రవాసులపై తన నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తోంది. ఈ నిర్ణయం కార్మిక మార్కెట్‌పై ప్రతికూల ప్రభావితం చూపిందని నివేదికలు అందిన నేపథ్యంలో నిబంధనలను సవరించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఈ కేటగిరీ ప్రజలు తమ రెసిడెన్సీని కొనసాగించడానికి సంవత్సరానికి సుమారు 1000 దినార్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో బీమా ఇతర రుసుములు ఉంటాయి. దీని వల్ల చాలా మంది ప్రత్యేక కార్మికులు 60 సంవత్సరాల తర్వాత దేశం విడిచి వెళ్ళారు. ముఖ్యంగా దశాబ్దాల అనుభవం ఉన్న వేలాది మంది కార్మికులు దేశం విడిచి వెళ్లడం వల్ల ప్రత్యేక వృత్తిపరమైన, సాంకేతిక కార్మికుల కొరత ఏర్పడటంతో ఇది కార్మిక మార్కెట్‌ను ప్రభావితం చేసింది. ఇటీవల మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి , అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ కార్మిక మార్కెట్లో స్కిల్డ్ లేబర్ సంఖ్యను పెంచడానికి అనేక దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఇందులో ప్రభుత్వ కాంట్రాక్టుల నుండి ప్రవాస ఉద్యోగులను ప్రైవేట్ రంగానికి తరలించడంతోపాటు గృహ కార్మికులను బదిలీ చేయడానికి అనుమతించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







