పాస్‌పోర్ట్ ఫోర్జరీ నెట్ వర్క్.. బహ్రెయిన్ వ్యక్తిపై విచారణ..!!
- November 06, 2024
మనామా: హై క్రిమినల్ కోర్టులో 40 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి పాస్‌పోర్ట్ ఫోర్జరీ కేసు విచారణను ఎదుర్కొంటున్నాడు. ఇరాన్ లో ఉన్న వ్యక్తితో కలిసి మోసపూరితంగా పాస్‌పోర్ట్ ఫోర్జరీ నెట్ వర్క్ ను రన్ చేస్తున్నట్లు అధికారులు విచారణలో గుర్తించారు. ఇరాన్‌లో నివసిస్తున్నప్పుడు పాస్‌పోర్ట్ స్టాంపులను నకిలీ చేయడం, 2017, 2019 మరియు 2024 సంవత్సరాలకు పాస్‌పోర్ట్ చెల్లుబాటును పొడిగించడం వంటి కేసులను నమోదు చేశారు. ఇరాన్ కు పారిపోయిన వ్యక్తితో కలిసి నిందితుడు జాతీయత, పాస్‌పోర్ట్‌లు మరియు నివాస వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ (NPRA) సంతకాలు, స్టాంపులను ఫోర్జరీ చేసినట్టు నిపుణులు నిర్ధారించారు. నిందితుడి పాస్‌పోర్ట్ గడువు ముగిసినట్లు అధికారులు గుర్తించడంతో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. పరారీలో ఉన్న వ్యక్తి ఇరాన్‌లో కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడని, బహ్రెయిన్ పౌరుల కోసం పాస్‌పోర్ట్ స్టాంపులు, సంతకాలను ఫోర్జరీ చేయడంలో నైపుణ్యం కలిగి ఉన్నాడని తెలిపారు. ఫిబ్రవరి 2023లోనిందితుడు యూఏఈలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం నుండి ట్రాన్సిట్ వీసాను కూడా పొందినట్టు గుర్తించారు.
ఇదిలా ఉండగా, బహ్రెయిన్ వెలుపల ఉన్న పౌరులకు పాస్‌పోర్ట్ పొడిగింపులు తప్పనిసరిగా అధికారిక రాయబార కార్యాలయాలు లేదా కాన్సులేట్ల ద్వారా రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. హై క్రిమినల్ కోర్ట్ విచారణను నవంబర్ 12కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!