బహ్రెయిన్ నుంచి పక్షుల స్మగ్లింగ్‌ని అడ్డుకున్న సౌదీ
- June 24, 2016
సౌదీ అథారిటీస్, 1000కి పైగా పక్షుల్ని బహ్రెయిన్ నుంచి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నాయి. సౌదీ కింగ్ ఫహద్ కాజ్‌వే కస్టమ్స్ ఈ వివరాల్ని వెల్లడించింది. రెండు వాహనాలకు చెందిన స్పెషల్ కంపార్ట్‌మెంట్లలో ఈ పక్షుల్ని ఉంచి రహస్యంగా తరలిస్తున్నారు. 1074 పక్షుల్ని పట్టుకున్నట్లు సౌది కింగ్ ఫవాద్ కాజ్‌వే జనరల్ డైరెక్టర్ దైఫల్లా అల్ ఏతైబి చెప్పారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాల్లో సోదాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రత్యేకంగా వాహనాల కింద ఏర్పాటు చేసిన కంటెయినర్లను గుర్తించామనీ, ఇందులో పక్షులు ఉన్నాయనీ, ఓ వాహనంలో 624 పక్షులు, ఇంకో వాహనంలో 450 పక్షలు ఉన్నాయని తెలిపారాయన. అన్ని దేశాల నుంచీ జీవించి ఉన్న పక్షుల్ని తరలించడాన్ని నిషేధించింది సౌదీ కస్టమ్స్. టెక్నికల్ సూపర్ విజన్‌లో తయారుచేసిన పక్షులు, అలాగే గుడ్లకు మాత్రమే అనుమతినిస్తుంది. గతంలో ఇలాగే ఓ సారి 2,500 పక్షుల్ని తరలిస్తుండగా సౌదీ కస్టమ్స్ సీజ్ చేసింది. 2015లో ఈ ఘటన చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







