వైఫై స్మార్ట్ ట్రాష్ బిన్స్ ఏర్పాటు చేసిన షార్జా
- June 24, 2016
వైఫై ట్రాష్ బిన్స్ని షార్జాలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ట్రాష్ బిన్స్ నిండిపోగానే, నిర్వాహకులకు సమాచారం అందించేలా వీటిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. తొలి విడతలో మొత్తం 10 స్మార్ట్ ట్రాష్ బిన్స్ని బీయాహ్ ఎన్విరాన్మెంట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా షార్జాలోని టూరిస్ట్ ప్రాంతాలకు దగ్గరలో ఏర్పాటు చేశారు. ట్రాష్ బిన్స్ సోలార్ పవర్‌తో నడుస్తాయి. సాధారణ బిన్స్కన్నా వీటిల్లో ఎక్కువ స్పేస్ ఉంటుంది. డు మరియు షురూక్ సహకారంతో షార్జా వ్యాప్తంగా స్మార్ట్ బిన్స్ ఏర్పాటు చేయనున్నట్లు బియాహ్ గ్రూప్ సిఇఓ ఖాలిద్ అల్ మురైమెల్ చెప్పారు. షురూక్ సిఇఓ మర్వాన్ అల్ సర్కాల్ మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా షార్జాకి ప్రపంచంలో మరింత ప్రత్యేకమైన గుర్తింపు తీసుకు రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







