పుష్ప 2 నుంచి శ్రీలీల పోస్టర్ వచ్చేసింది..

- November 10, 2024 , by Maagulf
పుష్ప 2 నుంచి శ్రీలీల పోస్టర్ వచ్చేసింది..

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తవ్వగా ఒక్క ఐటెం సాంగ్ బ్యాలెన్స్ ఉందన్నారు. ప్రస్తుతం ఆ ఐటెం సాంగ్ షూటింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. పుష్ప 1 సినిమాలో ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ లో సమంత స్టెప్పులేసి అదరగొట్టేసింది.

ఇప్పుడు పుష్ప 2 కోసం శ్రీలీలను తీసుకొచ్చారు. గత కొన్ని రోజులుగా పుష్ప 2 సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. షూటింగ్ నుంచి ఓ ఫోటో కూడా లీక్ అయింది. తాజాగా మూవీ యూనిట్ అధికారికంగా శ్రీలీల పోస్టర్ ని రిలీజ్ చేసారు. పుష్ప 2 లో కిస్సిక్ సాంగ్ లో ది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల చేస్తుందని అధికారికంగా తెలిపారు మూవీ యూనిట్. దీంతో అల్లు అర్జున్, శ్రీలీల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక శ్రీలీల డ్యాన్స్ అదరగొడుతుందని తెలిసిందే. అల్లు అర్జున్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ బెస్ట్ డ్యాన్సర్లలో ఒకరు. దీంతో వీరిద్దరి కాంబోలో మాస్ ఐటెం సాంగ్ రాబోతుందంటే ఏ రేంజ్ లో స్టెప్పులు వేస్తారో ఈ ఇద్దరు చూడాలి. ఊ అంటావా ఊ అంటావా సాంగ్ వరల్డ్ అంతా పాపులర్ అయింది. మరి ఇప్పుడు ఈ కిస్సిక్ సాంగ్ ఎంత వైరల్ అవుతుందో చూడాలి. ఇక పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com