కొత్త పోస్టర్లు విడుదల చేసిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్ర బృందం

- June 24, 2016 , by Maagulf
కొత్త పోస్టర్లు విడుదల చేసిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్ర బృందం

గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు శిరీష్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. పరశురామ్‌ దర్శకత్వం వహించారు. గౌరవం, కొత్తజంట వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అల్లు శిరీష్‌ మరోసారి తన ప్రతిభతో మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను కశ్మీర్‌లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా కొన్ని పోస్టర్లను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. చిత్రీకరణ దాదాపు పూర్తయిందని త్వరలో టీజర్‌ విడుదల చేస్తామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com