రస్ అల్ ఖైమాలో నూతన సంవత్సర వేడుకలు..షెడ్యూల్ ఇదే..!!

- November 20, 2024 , by Maagulf
రస్ అల్ ఖైమాలో నూతన సంవత్సర వేడుకలు..షెడ్యూల్ ఇదే..!!

యూఏఈ: యూఏఈలో అతిపెద్ద ఈవెంట్‌లలో ఒకటైన నూతన సంవత్సర వేడుకల సందర్భాం రస్ అల్ ఖైమాలో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. RAK NYE ఫెస్టివల్ పేరిట నిర్వహించే వేడుకలను డిసెంబర్ 31న జరుగనుంది. సందర్శకులందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. BM రిసార్ట్ నుండి 4-నిమిషాల ప్రయాణంలో ఉన్న సైట్ - ఫెస్టివల్ మైదానానికి దగ్గరగా పార్కింగ్ స్పాట్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  వేడుకల సందర్భంగా అనేక రకాల వంటకాలను అందించే ఫుడ్ ట్రక్కులతో పాటు ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాల్ అందించే బార్ కూడా ఉంటుందన్నారు. ప్రఖ్యాత కళాకారులు ముఖ్తార్ (అరబిక్ రాప్), ఫహ్మిల్ ఖాన్ బ్యాండ్ (బాలీవుడ్ సంగీతం), అంతర్జాతీయ DJతో సహా ఈవెంట్‌లో ప్రదర్శన ఇవ్వనున్నారని, కీలకమైన ఫైర్ వర్క్స్ ప్రదర్శన అర్ధరాత్రి ముందు ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించారు. మార్జన్ ద్వీపం, మర్జన్ ద్వీపం, అల్ హమ్రా విలేజ్ మధ్య వాటర్ ఫ్రంట్ ప్రాంతం, RAK NYE ఫెస్టివల్ గ్రౌండ్స్, ధయా, జైస్, యానాస్ మరియు రామ్స్ వంటి పార్కింగ్ జోన్‌లతో సహా అనేక వాన్టేజ్ పాయింట్ల నుండి ఫైర్ వర్క్స్ ను సందర్శకులు ఆస్వాదించవచ్చని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com