సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
- November 21, 2024
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీ.ఆర్. నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన బీఆర్ నాయుడు.. సీఎంను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాన్ని అందజేశారు.శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలపై కొద్దిసేపు చర్చ జరిగింది.
తిరుమల ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. తిరుమలలో స్వామివారి దర్శనం విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతి ఇవ్వకపోవడం పై కొంతకాలంగా తెలంగాణ నేతల నుంచి అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, బీఆర్ నాయుడు భేటీతో ఈ విషయం పై పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







