హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- November 21, 2024
హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు సాయంత్రం ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క.. మంత్రులు సీతక్క, సీఎస్, మేయర్ తదితరులు స్వాగతం పలికారు.
నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రపతి హైదరాబాద్ నగరంలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా ఇవాళ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే కోటీ దీపోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికగా నిర్వహించే లోక్ మంతన్ కార్యక్రమానికి ఆమె చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి 120 దేశాల నుంచి 15వందల మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







