ఊహించని ప్లేస్ లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
- November 22, 2024
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. నెట్టింట సైతం ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ అదిరిపోయే న్యూస్ తెలిపారు. ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చెయ్యని అద్భుతం చేయ్యబోతున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తున్నారో తెలిపారు టీమ్. డిసెంబర్ 21న సాయంత్రం 6 గంటలకి అమెరికాలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అత్యంత భారీగా నిర్వహించనున్నారు. ఇక ఈ ఈవెంట్ ను కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040 లో నిర్వహించనున్నారు.
ఇక ఈ ఈవెంట్ కి చిత్ర బృందం అందరూ హాజరు కానున్నారు. ఇప్పటికే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పాట్నాలో గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏకంగా అమెరికాలోనే తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. మరి అక్కడ కూడా తెలుగు సినిమాల హవ ఎలా ఉండబోతుందో చూడాలి. కాగా ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







