యూఏఈ విజిట్ వీసా: Dh3,000, రిటర్న్ టిక్కెట్లు, స్టే రుజువులు అవసరం..!!
- November 23, 2024
యూఏఈ: యూఏఈ సందర్శించే వారు విజిట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే ముందు అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. వారి చెప్పిన వివరాల ప్రకారం.. హోటల్ బుకింగ్ లేదా బంధువుల నివాస చిరునామా, తగినంత అమౌంట్, వీటికి సంబంధించిన రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. “ఇంతకుముందు, ప్రయాణికులు విమానం ఎక్కేటప్పుడు విమానాశ్రయంలో స్టే, రిటర్న్ టిక్కెట్లు, Dh3,000 కు సమానమైన కరెన్సీ చూపించవలసి ఉంటుంది. అయితే, ఇప్పుడు వారు వీసా కోసం దరఖాస్తు చేయడానికి ముందు పత్రాలను సమర్పించాలి” అని గలాదరి ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్వీసెస్ మేనేజర్ మీర్ వాసిం రాజా అన్నారు. విజిట్ వీసాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి వీటిని ప్రవేశపెట్టినట్టు ట్రావెల్ ఏజెంట్లు చెప్పారు. వీసా ఆమోదం కోసం స్టే, రిటర్న్ టిక్కెట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను తప్పనిసరిగా తమ సిస్టమ్‌లకు అప్లోడ్ చేయాలని ఏజెంట్లు తెలిపారు. అదే సమయంలో సందర్శకులు తమ పాస్‌పోర్ట్‌కు కనీసం ఆరు నెలల చెల్లుబాటు ఉండేలా చూసుకోవాలని గుర్తుచేశారు. ఎయిర్పోర్ట్ అధికారులు ఈ పత్రాల కోసం తనిఖీలు చేసే అవకాశం ఉందని, వీటిలో స్టే రుజువు, రిటర్న్ టిక్కెట్, నగదు లేదా క్రెడిట్ కార్డ్‌లో ఒక నెల వీసా కోసం Dh3,000, రెండు నెలలకు Dh5,000కి సమానమైన నిధులు ఉండాలి." అని ట్రావెల్ ఏజెంట్ తెలిపారు. ఒకవేళ సరైన పత్రాలను అందించడంలో విఫలమైతే వీసా రిజెక్ట్ అవుతుందన్నారు.
తాజా వార్తలు
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







