పిల్లలలో నోటి హెర్పెస్..పెరుగుతున్న కేసులపై డాక్టర్స్ ఆందోళన..!!
- November 25, 2024
యూఏఈ: యూఏఈలోని వైద్యులు పాఠశాల-వయస్సు పిల్లలలో నోటి హెర్పెస్ (HSV-1) కేసులలో పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శీతాకాలపు నెలలలో కేసులు పెరుగుతున్నాయని అన్నారు. సాధారణంగా పెదవులు మరియు నోటి చుట్టూ ఉన్న చర్మాన్ని ప్రభావితం చేసే వైరస్..ఇప్పుడు నోటి లోపల లేదా కళ్ల చుట్టూ కూడా కనిపిస్తుందని డాక్టర్లు తెలిపారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాఠశాలల్లో ఇంట్లో సామాజిక సమావేశాలు, ఆహారాన్ని పంచుకునే కార్యకలాపాలు ఎక్కువగా జరిగే శీతాకాలంలో వైరస్ మరింత సులభంగా వ్యాపిస్తుందన్నారు. "హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ టైప్ 1 (HSV-1) వల్ల కలిగే ఇన్ఫెక్షన్ చాలా అంటువ్యాధి. తాగే గ్లాసులు, వంటచేసే పాత్రలు, టవల్స్ వంటివి షేరింగ్ వస్తువుల ద్వారా సులభంగా వ్యాపిస్తుంది" అని థంబే యూనివర్సిటీ హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ ఇగ్నేషియస్ ఎడ్విన్ డిసౌజా తెలిపారు. పాఠశాల ఈవెంట్‌లు-ఫీల్డ్ ట్రిప్‌లు, స్పోర్ట్స్ డేలు, ఇతర సమావేశాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నోటి చుట్టూబొబ్బలు, దురద, జలదరింపు వంటి సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని సూచించారు
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







