ఉమ్ అల్ క్వైన్‌లో ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు..!!
- November 29, 2024
యూఏఈ: ఉమ్ అల్ క్వైన్ పోలీసులు ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపును ప్రకటించారు. డిసెంబర్ 1 నుండి జనవరి 5 వరకు 50 శాతం ట్రాఫిక్ జరిమానా తగ్గింపు ఆఫర్ అమల్లో ఉంటుందని తెలిపారు. 2024, డిసెంబరు 1కి ముందు ఉమ్ అల్ క్వైన్ ఎమిరేట్‌లో జరిగిన అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఇది వాహన సీజ్, ట్రాఫిక్ బ్లాక్ పాయింట్ల రద్దును కూడా కవర్ చేస్తుందిని, అయితే, తీవ్రమైన ఉల్లంఘనలకు ఆఫర్ పనిచేయదని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఈద్ అల్ ఎతిహాద్‌ను నిర్వహించే 53వ యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈఆఫర్ ప్రకటించినట్టు పోలీసులు తెలిపారు. వాహనదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అధికార యంత్రాంగం పిలుపునిచ్చింది.
ఇదిలా ఉండగా, అజ్మాన్ పోలీసులు కూడా ట్రాఫిక్ జరిమానాలపై 50 శాతం తగ్గింపును ప్రకటించారు. నవంబర్ 4 నుండి డిసెంబర్ 15 వరకు ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. అక్టోబర్ 31కి ముందు ఎమిరేట్‌లో జరిగిన ఉల్లంఘనలపై విధించే అన్ని జరిమానాలకు తగ్గింపు వర్తిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







