‘ఎయిర్పోర్ట్-టు-ఎయిర్పోర్ట్’ వీసా తిరస్కరణలు..కారణాలు ఇవేనా?
- November 29, 2024
యూఏఈ: ఇటీవల 'ఎయిర్పోర్ట్-టు-ఎయిర్పోర్ట్’ వీసా ఛేంజ్ కు ప్రయత్నించిన చాల మంది నిరాశే ఎదురవుతుంది. కొంతమంది వీసాలు రిజెక్ట్ కూడా అవుతున్నాయి. యూఏఈకి వచ్చేందుకు కొత్త విజిట్ వీసాల జారీ కోసం వేచి చూస్తున్నారు. సాధారణంగా ‘ఎయిర్పోర్ట్-టు-ఎయిర్పోర్ట్’ వీసా ఛేంజ్ అనేది వీసా గడువు ముగియనున్న విజటర్స్ ఎక్కువగా ఉపయోగించే సాధారణ పద్ధతి. ఇది యూఏఈ నుండి పొరుగు దేశానికి వెళ్లి, అక్కడ విమానాశ్రయంలో తాజా వీసా కోసం దరఖాస్తు చేస్తారు. వారి విజిట్ వీసా ఆమోదం తర్వాత తిరిగి యూఏఈలోకి అడుగు పెడతారు. అయితే, ట్రావెల్ ఏజెంట్లు యూఏఈలో తమ రెసిడెన్సీను పొడిగించాలనుకునే విజటర్స్ దేశం నుండి వెళ్లకుండా పొడిగింపు పొందాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎయిర్పోర్ట్-టు-ఎయిర్పోర్ట్ రన్ కంటే ఇది కొద్దిగా ఖరీదైనది అయినప్పటికీ, సురక్షితం అని జియోఫ్ ట్రావెల్ సీఈఓ జియోఫ్రీ సలాథన్ తెలిపారు. 'ఎయిర్పోర్ట్-టు-ఎయిర్పోర్ట్ వీసా మార్పు' రెండు నెలల వీసా కోసం Dh1,300 - Dh1,500 మధ్య ఖర్చు అవుతుందని, అదే యూఏఈలో వీసా పొడిగింపులు 30 రోజులకు సుమారు Dh1,050 ఖర్చవుతుందని పేర్కొన్నారు.
ఇటీవల వీసా గడువు ముగియడంతో ఖలీద్ అనే భారతీయ ఇంజినీర్ వీసా మార్పు కోసం యూఏఈ నుండి జీసీసీ దేశానికి వెళ్లాడు. కానీ అతడి వీసాను అధికారులు రిజెక్ట్ చేశారు. "నేను ఇప్పటికే రెండు రౌండ్ల ఉద్యోగ ఇంటర్వ్యూలను క్లియర్ చేసాను. మూడవది నవంబర్ 25 న జరగాల్సి ఉంది. ఎయిర్ పోర్టులోనే 36గంటలపాటు వేచి ఉన్నా ఫలితం లేదు. వీసా రిజెక్ట్ అయిందని నా ట్రావెల్ ఏజెంట్ చెప్పాడు. నాతో పాటు ప్రయాణిస్తున్న ఇతరులకు కూడా వీసాలు తిరస్కరించబడ్డాయి. మరో మార్గం లేకపోవడంతో భారతదేశంలోని తన స్వగ్రామానికి తిరిగి రావాల్సి వచ్చింది. యూఏఈ జాతీయ దినోత్సవ సెలవుల తర్వాత ఇంటర్వ్యూ రీషెడ్యూల్ చేశారు. నేను ఉద్యోగం సంపాదించి, యూఏఈలో అడుగు పెడతానన్న నమ్మకం ఉంది.’’ వివరించాడు. ఇటీవల తమ క్లయింట్ల వీసా దరఖాస్తులను రిజెక్ట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయని కొంతమంది ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు. "కొత్త వీసా రిక్వైర్మెంట్స్, వసతికి సంబంధించిన రుజువులు, నగదు అందుబాటు, రిటర్న్ టిక్కెట్లను చూపించాలని తప్పనిసరి చేయడం వంటి కారణాలు కూడా వీసా తిరస్కరణలకు దోహదపడుతున్నాయి." అని వైస్ఫాక్స్లోని అవుట్‌బౌండ్ ట్రావెల్ సీనియర్ కన్సల్టెంట్ శంషీద్ సివి అన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్‌లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు







