రియాద్‌లో భారీ డ్రగ్ రాకెట్ బస్ట్..పొలీసుల అదుపులో నిందితులు..!!
- December 01, 2024
రియాద్: రియాద్‌లో భారీ డ్రగ్ రాకెట్ బస్ట్ అయింది. మెటల్ పైపులలో దాచిన 2,413,135 యాంఫెటమైన్ మాత్రలను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్‌ను రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఇందులో సౌదీ పౌరుడితోపాటు ఒక సిరియన్ ఉన్నాడని అధికారులు తెలిపారు. డ్రగ్స్ స్మగ్లింగ్ లేదా పంపిణీ కార్యకలాపాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని నివేదించాలని అధికారులు కోరారు.
మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్‌లోని 911కి, రాజ్యంలోని ఇతర ప్రాంతాలలో 999కి లేదా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ హాట్‌లైన్ 995కి కాల్ చేయడం ద్వారా సమాచారం అందజేయాలని కోరారు. అలాగే 995@gdnc.gov.sa ఇమెయిల్ ద్వారా కూడా అందించవచ్చని, సమాచారం అందజేసిన వారి వివరాలను అత్యంత గోప్యంగా పెడతామని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







