రియల్ ఎస్టేట్ కంపెనీపై 20.5 మిలియన్ దిర్హాంల వ్యాజ్యం..కొట్టివేసిన కోర్టు..!!

- December 01, 2024 , by Maagulf
రియల్ ఎస్టేట్ కంపెనీపై 20.5 మిలియన్ దిర్హాంల వ్యాజ్యం..కొట్టివేసిన కోర్టు..!!

దుబాయ్: రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీపై ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలపై దాఖలైన 20.5 మిలియన్ దిర్హామ్‌ల వ్యాజ్యాన్ని దుబాయ్ కమర్షియల్ కోర్ట్ కొట్టివేసింది. 52 ఏళ్ల ఎమిరాటీ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీ తనను మోసం చేసిందని కోర్టులో సూట్ దాఖలు చేశారు.

దుబాయ్‌లోని అల్ బర్షా ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో యూనిట్లను కొనుగోలు చేయడానికి అతను 23.5 మిలియన్ దిర్హామ్‌లు చెల్లించినట్టు తెలిపారు.  కానీ, సదరు రియల్ కంపెనీ 20.5 మిలియన్ దిర్హామ్‌లను ప్రాజెక్ట్ ఎస్క్రో ఖాతాలో జమ చేయలేదని, ఫలితంగా ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

అయితే, న్యాయస్థానం నియమించిన ఆర్థిక నిపుణుడు రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిందని, పిటిషనర్ చాలా యూనిట్లను లాభం కోసం తిరిగి విక్రయించాడని నిర్ధారించారు. ఆర్థిక నష్టం వచ్చిందన్న వాదనను తిరస్కరించారు. 2023 ప్రారంభంలో సెటిల్మెంట్ ఒప్పందాన్ని చేసుకున్నామని,  ఆ సమయంలో అతను వివాదంలో ఉన్న అనేక యూనిట్లను విజయవంతంగా సేల్ చేసేశాడని గుర్తించి కోర్టుకు నివేదిక సమర్పించారు. దాంతో కోర్టు పిటిషన్ నుకొట్టివేయడంతోపాట చట్టపరమైన ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com