చిన్నారి వైశాలిని ప్రధాని కలుసుకున్నారు..
- June 26, 2016
తన సహాయం కోరిన చిన్నారి వైశాలిని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నాడు కలుసుకున్నారు. తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, గుండె జబ్బుతో బాధపడుతున్న తనకు సాయం కావాలని ఆరేళ్ల బాలిక వైశాలి కొద్ది రోజుల క్రితం ప్రధానికి లేఖ రాసింది.
పుణెకు చెందిన వైశాలి రెండో తరగతి చదువుతోంది. గుండెలో రంధ్రం సమస్యతో బాధపడుతున్నది. పెయింటర్‌గా పని చేసే ఆమె తండ్రి ఆపరేషన్ చేయించలేకపోయారు. మందులు కొనడానికి పాప ఆడుకునే బొమ్మల్నీ, సైకిల్‌నూ అమ్మిన సందర్భాలున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తన గుండెజబ్బుకు చికిత్స చేయించేందుకు తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేవనీ, సహాయం చేయాలంటూ ఆమె ప్రధాని మోడీకి లేఖ రాసింది. దీనిపై స్పందించిన మోడీ.. ఆమెకు ఆపరేషన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. వైశాలికి ఆపరేషన్ జరిగింది.
అనంతరం, శనివారం ప్రధాని మోడీ తన పుణె పర్యటనలో.. వైశాలిని, ఆమె తల్లిదండ్రులను కలుసుకున్నారు. వైశాలితో ఆప్యాయంగా ముచ్చటించారు. చిన్నారికి తాము సహాయపడగలిగినందుకు సంతోషంగా ఉందని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. శస్త్రచికిత్స తర్వాత వైశాలి తన గుండెను తట్టే లేఖ రాసిందనీ, అది తన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







