త్వరలో కిచెన్ లెస్ సిటీగా దుబాయ్..!!

- December 03, 2024 , by Maagulf
త్వరలో కిచెన్ లెస్ సిటీగా దుబాయ్..!!

దుబాయ్: ఎమిరేట్‌లో ఫుడ్ డెలివరీ, ఇ-కామర్స్ బిజినెస్ వేగంగా అభివృద్ధి చెందుతున్నది.  కిచెన్‌లు లేని భవనాలను కలిగి ఉన్న ప్రపంచంలోని మొదటి నగరంగా దుబాయ్ త్వరలో మారనుంది. దుబాయ్‌లో కిచెన్‌లెస్ భవనాల ప్రణాళికలు ఇప్పటికే కొనసాగుతున్నాయని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నూన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ అలబ్బర్ వెల్లడించారు.   ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వేగంగా పెరగడం డైనింగ్ అలవాట్లను మార్చిందని అలబ్బర్ వివరించారు.    

యూఏఈలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బిజెన్ వృద్ధి ముఖ్యంగా మహమ్మారి అనంతర కాలంలో పెరిగింది. 2017లో $1-బిలియన్ పెట్టుబడితో ప్రారంభించిన నూన్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజాలను సవాలు చేస్తూ యూఏఈలో ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.         

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com