పెట్రోలింగ్ కారును ఢీకొట్టిన వాహనం.. ఇద్దరు పోలీసులు మృతి..!!
- December 04, 2024
కువైట్: కువైట్ లోని ఫహాహీల్ ఎక్స్ప్రెస్ వేలో సాల్వా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసు పెట్రోలింగ్ కారును మరో బలంగా ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో డ్యూటీలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. అధికారుల కథనం ప్రకారం.. ఢీకొట్టిన తర్వాత నిందితుడు సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. అలెర్టయిన పోలీసులు నిమిషాల వ్యవధిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు బహిష్కృతుడని, డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు తెలిపారు. సాల్వా ప్రాంతానికి సమీపంలో ఉన్న వంతెనపై పోలీసు అధికారులు ఆగిన వాహనాన్ని పరిశీలిస్తుండగా, వేగంగా వచ్చిన కారు వారిని నేరుగా ఢీకొట్టింది. ఇదిలా ఉండగా, డ్యూటీలో ఉన్న ఇద్దరు అధికారుల మృతికి అంతర్గత మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..