డోకిపర్రు గ్రామాన్ని సందర్శించనున్న సీఎం చంద్రబాబు

- December 14, 2024 , by Maagulf
డోకిపర్రు గ్రామాన్ని సందర్శించనున్న సీఎం చంద్రబాబు

అమరావతి: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామాన్ని శనివారం సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. గ్రామంలోని శ్రీభూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో నవమ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ఆలయ బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక పూజ...
ఆలయ బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం హెలికాఫ్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు విజయవాడ (గన్నవరం) ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌కు చేరుకుంటారు. 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ అక్కడ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం 8.30గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అధినేత, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధా రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం 3.45 గంటలకు ఉండపల్లిలోని తన నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో సీఎం చంద్రబాబు బయలుదేరి 4.00 గంటలకు డోకిపర్రు గ్రామానికి చేరుకుంటారు. హెలిపాడ్ నుంచి రోడ్డు మార్గంలో శ్రీభూ సమేత వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు.

కాగా, సీఎం హెలికాఫ్టర్‌లో డోకిపర్రు రానున్న దృష్ట్యా స్థానిక మేఘా సంస్థ ఫార్మ్ హౌస్ ఎదుట పొలాల్లో హెలిపాడ్ నిర్మాణానికి ఎస్పీ, కలెక్టర్ నిన్న పరిశీలించి అనుమతి ఇచ్చారు. దీంతో మేఘా సంస్థ ప్రతినిధులు యుద్ధ ప్రాతిపదికన హెలిపాడ్ నిర్మాణ పనులు చేపట్టారు. చంద్రబాబు పూజలు చేసే ప్రాంతాన్ని ఎస్పీ, కలెక్టర్ పరిశీలించి చేపట్టాల్సిన ఏర్పాట్ల పై ఆలయ ప్రతినిధులకు సూచనలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com