తెలంగాణ: కురుమ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్..
- December 15, 2024
హైదరాబాద్ : కోకాపేటలో నిర్మించిన కురుమ విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ – దొడ్డి కొమురయ్య కురుమ భవన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కురుమ సంఘం పెద్దలు సన్మానించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య పోరాటాలను స్మరించుకున్నారు. రజాకార్లను గ్రామాల్లోకి రాకుండా, దొరల పెత్తనాన్ని అడ్డుకోవడానికి దుడ్డు కర్రల సంఘం పెట్టి పోరాడిన గొప్ప యోధుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు.
చాకలి ఐలమ్మ పేరును యూనివర్సిటీకి పెట్టినట్టుగానే, దొడ్డి కొమురయ్యని శాశ్వతంగా గుర్తుండిపోయేలా మంత్రివర్గ సహచరులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. దొడ్డి కొమురయ్య భవన ప్రాంగణం ఒక విద్యా వేదిక కావాలి. విజ్ఞానం పంచాలి. కురుమ సోదరులకు విద్య కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని అన్నారు. జనాభా ప్రాతిపదికన ఫలాలు అందాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన 98 శాతం మేరకు పూర్తయిందని ముఖ్యమంత్రి చెప్పారు. మిగిలిన రెండు శాతం పూర్తయితే దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ కులగణన తెలంగాణ ప్రజల మెఘా హెల్త్ ప్రొఫైల్‌గా మారుతుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లుగా వెల్లడిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని వివరించారు. రుణమాఫీ, వరికి బోనస్, ఉచిత విద్యుత్, రూ.500 కే సిలిండర్, పేదలకు వైద్య సౌకర్యాలు అందించడం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువగా బలహీన వర్గాలకు అందాయని చెప్పారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కర్నాటక రాష్ట్ర మాజీ మంత్రి హెచ్ ఎం రేవణ్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి