#SK25 అనౌన్స్ మెంట్
- December 15, 2024
ట్యాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ తన మైల్ స్టోన్ 25వ మూవీ కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగరతో కొలాబరేట్ అవుతున్నారు.ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీలో జయం రవి, అథర్వ, శ్రీలీల కీ రోల్స్ పోషించనున్నారు.ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ బాస్కరన్ గ్రాండ్ గా నిర్మించనున్నారు.ఈ మచ్ అవైటెడ్ మూవీని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత ఆకాష్ బాస్కరన్ మాట్లాడుతూ.. మా ప్రొడక్షన్ నెం.2 చిత్రాన్ని తన అసాధారణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రతిభావంతుడైన హీరో శివకార్తికేయన్ తో గ్రాండ్ గా నిర్మిస్తునందుకు ఆనందంగా వుంది. శివకార్తికేయన్ 25వ చిత్రాన్ని నిర్మించడం మాకు గొప్ప సంతోషాన్ని ఇస్తోంది.ఈ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ జాతీయ అవార్డు-విన్నర్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అత్యంత భారీ అంచనాల చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. అసాధారణమైన కథలను ఎంచుకునే నటులు జయం రవి, అథర్వ, శ్రీలీల ఈ ప్రాజెక్ట్‌లో చేతులు కలపడం మాకు సంతోషంగా ఉంది.
ప్రతిష్టాత్మకగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చనున్నారు. ఇది G.V. ప్రకాష్‌కి 100వ సినిమా కావడం మరింత ప్రత్యేకం. #SK25 యూనిక్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని మీకు హామీ ఇస్తున్నాము' అన్నారు.
నటీనటులు: శివకార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల
రచన, దర్శకత్వం: సుధా కొంగర
నిర్మాత: ఆకాష్ బాస్కరన్
బ్యానర్: డాన్ పిక్చర్స్
సంగీతం: జీవి ప్రకాష్ కుమార్
డీవోపీ: రవి కె. చంద్రన్
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







