వైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్ అడవి శేష్
- December 17, 2024
ఈతరం టాలీవుడ్ యుంగ్ హీరోల్లో వైవిధ్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అడవి శేష్. చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు. సరికొత్త కథలతో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. అంతేకాకుండా రైటర్ గా, దర్శకుడిగానూ సత్తా చాటుతున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. నేడు టాలీవుడ్ యుంగ్ హీరో శేష్ పుట్టినరోజు.
అడివి శేష్ 1985 డిసెంబర్ 17న జన్మించాడు. పుట్టింది ఇక్కడే అయినా, అమెరికాలోనే పెరిగాడు. అక్కడే చదువుకున్నాడు.అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీలో CA పట్టా పొందాడు. తన బంధువు సినిమా పరిశ్రమలో ఉండటంతో ఆయనకు కూడా సినిమాలపై ఆసక్తి పెరిగింది. సినిమాల్లో నటించాలనే కోరికతోనే అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశాడు. కొన్ని సినిమాల్లో నటించేందుకు ఆడిషన్స్ కు వెళ్లాడు. కానీ, చాలామంది తిరస్కరించారు. అయినా, తను వెనక్కి తగ్గలేదు. యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. సినిమా నిర్మాణంలోనూ ట్రైనింగ్ పొందాడు.
‘సొంతం’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన శేష్. ఇందులో చిన్న పాత్ర చేశాడు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ‘పంజా’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బలుపు’, ‘రన్ రాజా రన్’, ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు. ‘బాహుబలి’ తొలి భాగంలో బల్లాల దేవుడి కొడుకుగా కనిపించాడు. ‘క్షణం’, ‘ఊపిరి’, ‘అమీ తుమీ’, ‘గూఢచారి’, ‘ఓ బేబీ’, ‘ఎవరు’ సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు. ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్ 2’, ‘మేజర్’ వంటి వైవిధ్య భరితమైన సినిమాలతో హీరోగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు, ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’ సినిమాలకు ఆయనే కథను అందించాడు. కర్మ’, ‘కిస్’ సినిమాలతో ప్రయోగాలు కూడా చేశాడు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే అడవి శేష్‌కు సినిమాలు అంటే పిచ్చి. అందుకే, అమెరికా లైఫ్‌ను కాదనుకుని.. టాలీవుడ్ వచ్చేశాడు. కష్టపడ్డాడు.. అన్ని రంగాల్లో పట్టు సాధించాడు. ఇప్పుడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. టాలెంట్ ఎక్కడున్నా అక్కున చేర్చుకోవడం తెలుగు ప్రేక్షకుల నైజం. అందుకే, అడవి శేషు కూడా అందరివాడు అయ్యాడు. విభిన్న సినిమాలతో అదరగొడుతున్నాడు.
- డి.వి.అరవింద్
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025