సెన్సార్ పూర్తిచేసుకున్న 'రోజులు మారాయి'

- June 27, 2016 , by Maagulf
సెన్సార్ పూర్తిచేసుకున్న 'రోజులు మారాయి'

మారుతి అనగానే ఒకప్పుడు బూతు డైరెక్టర్ , బూతు సినిమాలే చేస్తాడు అనేవారంత ఇప్పుడు ఈ డైరెక్టర్ పేరు చెప్పగానే భలే డైరెక్టర్ రా బాబు.అంటున్నారు అంతలా మార్పు వచ్చింది మారుతిలో..
తన తీసిన సినిమాల్లో మొదటిసారి సెన్సార్ నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు 'భలే భలే మగాడివోయ్' చిత్రంతో..తాజాగా మరోసారి సెన్సార్ నుండి 'యూ/ఏ' పొందాడు..దిల్ రాజు , మారుతి కంబినేషన్ గుడ్ సినిమాస్ పతాకం పై తెరకెక్కిన చిత్రం 'రోజులుమారాయి'..
తాజాగా సెన్సార్ సభ్యులు చిత్రాన్ని చూసి కేవలం ఆరుచోట్ల డైలాగ్ చేంజ్‌ను మాత్రమే సూచించి 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాలో ఓ హత్యకు సంబంధించిన సన్నివేశం ఉన్నందువల్లే 'యూ/ఏ' వచ్చిందని, లేదంటే 'యూ' సర్టిఫికెటే వచ్చేదని చిత్ర యూనిట్ తెలిపారు..మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చేతన్, పార్వతీశం, తేజస్వి, కృతిక ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ శుక్రవారం (జూలై 1న) ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com