యూఏఈ వెదర్ అప్డేట్: క్రిస్మస్ రోజున వర్షం కురుస్తుందా?
- December 22, 2024
యూఏఈ: యూఏఈలోని నివాసితులు 'వైట్ క్రిస్మస్'ను ఆస్వాదించలేరా? ఉష్ణోగ్రతల తగ్గుదల ఖచ్చితంగా అన్ని రకాల కార్యకలాపాలకు వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా చేస్తుందా? వాతారణ శాఖ అప్డేట్ అవును అంటుంది. పండుగ సీజన్ ప్రారంభమైంది. కుటుంబాలు పండుగ కార్యకలాపాలను ప్లాన్ చేస్తున్నాయి. ఇది వింటర్ మార్కెట్‌లకు వెళ్లడం లేదా పార్కులో కుటుంబ సమయాన్ని ఆస్వాదించడం వంటివి ఉన్నాయి.
క్రిస్మస్ ఈవ్, క్రిస్మస్ రోజున అవుట్‌డోర్‌లో ప్లాన్ చేసే అన్ని కార్యకలాపాల కోసం వాతావరణ శాఖ అప్డేట్ ప్రకటించింది. క్రిస్మస్ ఈవ్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమైన ఉండవచ్చు. క్రిస్మస్ ను జరుపుకోవడానికి ఒక ద్వీపానికి లేదా తీర ప్రాంతాలకు వెళుతున్నట్లయితే వర్షపాతం వచ్చే అవకాశం ఉన్నందున గొడుగును తీసుకెళ్లండి.
ఉష్ణోగ్రతలు అబుదాబిలో గరిష్టంగా 24°C , దుబాయ్‌లో 25°Cకి చేరుకుంటాయి. అయితే రెండు ఎమిరేట్స్‌లో కూడా 16°Cకి తగ్గుతాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి, ఉదయం తేమగా ఉంటుందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయని తెలిపింది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







