బ్రెగ్జిట్‌పై చర్చల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు: డేవిడ్‌ కెమరాన్‌

- June 27, 2016 , by Maagulf
బ్రెగ్జిట్‌పై చర్చల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు: డేవిడ్‌ కెమరాన్‌

ఐరోపా కూటమి నుండి నిష్క్రమించే అంశంపై చర్చలు జరిపి, తదుపరి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని డేవిడ్‌ కెమరాన్‌ ప్రకటించారు. రిఫరెండం ఫలితాలు వెలువడిన తరువాత జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా కూటమి నుండి నిష్క్రమించే అంశాలపై చర్చలు జరిపి తదుపరి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని ప్రతిపాదించారని, నిష్క్రమణకు సంబందించిన వివిధ అంశాలపై చర్చలు జరిపి తీసుకోవాల్సిన చర్యల నివేదిక ఇవ్వటంతో పాటు కొత్త ప్రధానికి సలహా ఇచ్చేం దుకు కూడా ఈ విభాగం పనిచేస్తుందని ప్రధాని నివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే బ్రిటన్ కు ఇయుకు భావి సంబంధాలపై నిర్ణయం తీసుకునే అధి కారం మాత్రం ఈ విభాగానికి వుండదని ఆమె వివరించారు. ఈ కొత్త విభాగదంలో ఆర్థిక, విదేశాంగ, ఇతర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులుంటారని ఆమె చెప్పారు. ప్రక్రియ ప్రారంభించాకే చర్చలు మెర్కెల్‌ ఐరోపా కూటమి నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న బ్రిటన్‌ తో నిష్క్రమణ ప్రక్రియ ప్రారంబించటానికి ముందు ఎటువంటి చర్చలకు అవకాశం లేదని జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ స్పష్టం చేశారు. నిష్క్రమణకు బ్రిటన్‌ కోరిన గడువును అంగీకరి స్తూనే అది 'దీర్ఘకాలికం' కారాదని ఆమె తేల్చిచెప్పారు. బ్రిటన్‌ నిష్క్రమణపై చర్చలను వేగవంతం చేసేందుకు ఆమె ఫ్రాన్స్‌ అధ్యక్షుడిని, ఇటలీ ప్రధానిని సంప్రదించనున్నారు. ఇదిలా వుం డగా బ్రెగ్జిట్‌పై తీవ్ర కుదుపునకు గురైన మార్కెట్లను సము దాయించేందుకు బ్రిటన్‌ ఆర్థిక మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. లేబర్‌ పార్టీని వీడని సంక్షోభం షాడో కేబినెట్‌ నుంచి 16 మంది నిష్క్రమణ బ్రెగ్జిట్‌ అనంతరం బ్రిటన్‌ పతిపక్ష లేబర్‌ పార్టీలో నెలకొన్న సంక్షోభం సోమవారం మరింత ముదిరింది. నిరసనలు, నిష్క్రమణలు కొనసాగుతున్నా వాటిని లెక్క చేయకుండా లేబర్‌ పార్టీ నేత జెర్మీ కార్బిన్‌ తన షాడో మంత్రివర్గాన్ని పునర్వ్వవస్ధీకరించే దిశగా చర్యలు చేపట్టారు. బ్రెగ్జిట్‌ వ్యతిరేక ప్రచారాన్ని సరిగా ఎదుర్కోలేక పోయారని ఆయనపై ఆరోపణలు చేస్తూ షాడో మంత్రి వర్గంలోని 12 మంది ఆదివారం రాజీనామా చేసి తిరుగుబాటు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మరో నలుగురు షాడో మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో షాడో మంత్రి వర్గం నుంచి వైదొలిగిన వారి సంఖ్య 16కు చేరుకుంది.. నిష్క్రమణ ఇలా! - ఐరోపా కూటమి నుండి బ్రిటన్‌ నిష్క్రమణపై చర్చించేందుకు ఈ నెల 28, 29 తేదీల్లో కూటమి సభ్యదేశాలు భేటీ అవుతున్నాయి.- నిష్క్రమించ దలచిన వారికి రెండేళ్ల కాల పరిమితి విధిస్తున్న లిస్బన్‌ ఒప్పందంలోని 50వ అధికరణ కింద వెంటనే నిష్క్రమణ ప్రక్రియ చేపట్టాలని బ్రిటన్‌ ఐరోపా కూటమిని కోరనున్నది.- అనంతరం బ్రిటన్‌, ఐరోపా కూటమి మధ్య చర్చల పర్వం మొదలవుతుంది.- నిష్క్రమణకు సంబంధించిన ముసాయి దాను 27 మందిసభ్యులున్న ఐరోపా మండలి పరిశీలనకు సమర్పిస్తారు.- దీనిపై సమగ్రంగా చర్చించిన అనంతరం ఐరోపా పార్లమెంట్‌ దీనిని ధృవీకరించాల్సి వుంటుంది. (సభ్యదేశాల సమ్మతితో ఈ చర్చల ప్రక్రియను రెండేళ్ల వరకూ పొడిగించవచ్చు)- చర్చలు పొడిగించకపోతే ఐరోపా కూటమికి సంబంధించిన ఒప్పందాలేవీ బ్రిటన్‌కు వర్తించవు.- చివరిగా బ్రిటన్‌ ఐరోపా కూటమి నుండి నిష్క్రమించాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com