ఆ చిన్నారులకు అడ్మిషన్స్‌ దొరకడంలేదు

- June 27, 2016 , by Maagulf
ఆ చిన్నారులకు అడ్మిషన్స్‌ దొరకడంలేదు



డిఫరెంట్లీ ఏబుల్డ్‌ (వికలాంగులు) చిన్నారులకు స్కూళ్ళలో ప్రవేశాలు దొరక్కపోవడం పెద్ద సమస్యగా మారిందని వారి హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్‌ ఫ్యామిలీ సపోర్ట్‌ బహ్రెయిన్‌ (ఎస్‌ఎఫ్‌ఎస్‌) ఫౌండర్‌ అదియా హరూన్‌ మాట్లాడుతూ, 400 కుటుంబాల నుంచి 1000 మంది వరకు తమ సంస్థలో సభ్యులుగా ఉన్నారనీ, అందులో చాలామంది స్కూళ్ళలో ప్రవేశాలు లేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. స్కూళ్ళలో అడ్మిషన్‌ దొరక్కపోవడం వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయన్నారాయన. కొద్ది స్కూళ్ళు మాత్రమే తక్కువ ఫీజులతో అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ, అక్కడ డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉండటంతో అడ్మిషన్లు దొరకడం కష్టమవుతోందని చెప్పారాయన. తమ చిన్నారికి ఏర్పడిన వైకల్యం కారణంగా, చదువుకు దూరమవడం బాధగా ఉందనీ, చదువుకోడానికి వైకల్యం అడ్డు కాదని ఓ చిన్నారి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com