ప్రవాస భారతీయ వంశీ గ్లోబల్ అవార్డు అందుకున్న శ్రీనివాస్ గూడూరు
- December 27, 2024
హైదరాబాద్: వృత్తి రీత్యా విదేశాల్లో స్థిర పడినప్పటికీ అక్కడ తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షణలో ఇక్కడ వున్నవారికన్నా తెలుగు సంప్రదాయాలు కళలు పట్ల తమ అభిమానం చూపుతున్నారని వంశీ ఇంటర్నేషనల్(India) స్థాపకుడు వంశీ రామరాజు అన్నారు. శ్రీ ముఖీ కాంప్లెక్స్ లోని ఎలైడ్ ఆర్టిస్ట్స్ ఆడిటోరియంలో స్థిరపడిన అమెరికాలో ఎస్.పి.బి మ్యూజిక్ ఇంటర్నేషనల్( USA) ఛైర్మెన్ శ్రీనివాస్ గూడూరుకు ప్రవాస భారతీయ వంశీ గ్లోబల్ అవార్డు ప్రదానోత్సవం సభ జరిగింది వంశీ రామరాజు అవార్డు బహుకరించి మాట్లాడారు విఖ్యాత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం పేరిట సంగీత సంస్థను స్థాపించి అయన పాడిన పాటలు అక్కడి వారికి ప్రచారం చేస్తున్న పాటల ప్రియుడు శ్రీనివాస్ అన్నారు దేశం నుంచి తెలుగు వారు ఎవరు వెళ్లినా అయన సహాయ సహకారాలు అందిచే సహృదయుడు అని వివరించారు. ఇక్కడి తెలుగు గాయకులను పిలిపించి అక్కడ ప్రదర్శనలు కు తోడ్పటు అందించే మంచి మనిషి శ్రీనివాస్ అని కొనియాదారు.ఈ సందర్భంగా ప్రముఖ నేపథ్య గాయకుడు పార్థ సారథి రామాచారి గాయకులు వినోద్ బాబు వై.ఎస్ రామకృష్ణ తదితరులు మధుర గీతాలు ఆలపించారు శైలజ సుంకరపల్లి మధుర వీణ సుధామయి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







