#PMF49 కోసం గోల్డెన్ స్టార్ గణేష్ తో కోలాబ్రెట్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
- December 29, 2024
శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్, తన మూవీ కృష్ణం ప్రణయ సఖి-ఇటీవల 100 రోజులు జరుపుకున్న థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తన అభిమానులకు ఎక్సయిటింగ్ వార్తను అందించారు. గణేష్ అప్ కమింగ్ కన్నడ చిత్రం #PMF49 కోసం ప్రతిష్టాత్మకమైన తెలుగు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కోలాబ్రెట్ అవుతున్నారు.
కార్తికేయ 2, వెంకీ మామ, ఓ బేబీ, ఢమాకా న్యూ-సెన్స్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు చిత్ర పరిశ్రమకు గణనీయమైన సహకారం అందించింది. #PMF49తో, వారు గణేష్ లీడ్ రోల్ లో గొప్ప సినిమాటిక్ ఎక్సపీరియన్స్ అందించడం ద్వారా కన్నడ సినిమా పట్ల తమ నిబద్ధతను చాటారు.
టీజీ విశ్వ ప్రసాద్ నేతృత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హై క్యాలిటీ స్టొరీ టెల్లింగ్, అత్యాధునిక నిర్మాణం ద్వారా కన్నడ సినిమాను మరో లెవల్ కి తీసుకువెళ్ళడానికి అంకిత భావంతో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ కన్నడ సినిమా అపారమైన సామర్థ్యాన్ని ఒక బిగ్ స్టేజ్ పై ప్రెజెంట్ చేయాలనే వారి లక్ష్యాన్ని తెలియజేస్తోంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ బి. ధనంజయ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రం యూనిక్ అండ్ లార్జ్ దెన్ లైఫ్ స్టొరీగా వుండబోతోంది. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
ఈ సినిమా టైటిల్, నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!







